ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం రేపాయి. అంతేకాకుండా పోలవరం, శంకరాపురం, తూర్పుకంభంపాడు, వేంపాడు, మారెళ్ల, పసుపుగల్లు, ముండ్లమూరు, శంకరాపురం సహా మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. Also Read: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు దీంతో ముండ్లమూరు స్కూలు నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు సైతం వణికిపోతూ బయటకు పరిగెట్టారు. - దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు.- దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి.- భయంతో ఇళ్ళలో నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు.- గతంలో దగ్గరలోని చీమకుర్తి క్యారీల వలన భూమి కంపించిన ధకలాలు.- రిక్టర్ స్కేలు పై ఎంత నమోదు అయ్యిందో… pic.twitter.com/scUl44IrZA — RTV (@RTVnewsnetwork) December 21, 2024 రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం రెండు తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం చర్చనీయాంశమైంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు ఇటీవల తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధి వరకు భూమి కంపించింది. Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు! తెలంగాణలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, జనగామా జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి పరుగులు తీశారు. Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!