వైస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. జగన్ తోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్‌రెడ్డి.