/rtv/media/media_files/2026/03/22/death-toll-in-the-adulterated-milk-incident-reaches-to-17-2026-03-22-06-55-10.jpg)
death toll in the adulterated milk incident reaches to 17
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది. నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన పిచ్చుక నాగేశ్వరరావు (72) గత నెల 16న కల్తీ పాలు తాగి అస్వస్థకు గురయ్యారు. దీంతో 17న రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
Also Read: ఇండియాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. రంగంలోకి ఆర్మీ..?
కిడ్నీలు దెబ్బతినడం వల్ల వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు డయాలసిస్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కల్తీ పాల ఘటనలో మార్చి 13వ తేదీ వరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా.. నాగేశ్వర రావు మృతితో 17కి చేరింది. మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకరు కొలుకొని డిశ్చార్చి అయ్యారు.
Also Read: హర్మూజ్ జలసంధిలో.. భారత నౌకకు దారి చూపిన ఇరాన్ నేవీ
Follow Us