Chamundeshwarnath: భారత యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆసీస్ మాజీ క్రికెటర్స్ సైతం నితీష్ ఆటతీరును కొనియాడుతున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు చాముండేశ్వరీనాథ్.. నితీష్‌ను తెగ పొగిడేశారు. RTVతో ప్రత్యేకంగా మాట్లాడిన చాముండేశ్వరీనాథ్.. నితీష్ కుమార్ నేటి తరం యువకులకు ఆదర్శమని, భారత క్రికెట్‌కు కాబోయే కెప్టెన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అవకాశాలు ఇవ్వాలి.. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ఆల్ రౌండర్ రూపంలో భారత క్రికెట్‌కు దొరికిన అణిముత్యం. అతని ఆటతీరు అద్భుతం. హార్దిక్ పాండ్యాను రిప్లేస్ చేసే సత్తా ఉన్నవాడు ఇతనే. బ్యాటింగ్ ఆర్డర్‌లో 7,8 నెంబర్ లో దిగడమే సరైనది. ఎందుకంటే టాప్ ఆర్డర్ విఫలమైతే ఇలాంటి బ్యాటర్ బ్యాక్ అప్ అవసరం చాలా ఉంటుంది. ఒక్క హుక్ షాట్ కొట్టకుండా సెంచరీ చేసిన తీరు అద్భుతం. ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతను రెండు మూడు ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లకు సూచించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాణ్యమైన క్రికెటర్లను తయారుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను నేషనల్ సెలెక్టర్ గా ఉన్నప్పుడు అండర్ 19, 17, 14 స్థాయిలో చాలామంది తెలుగు కుర్రాళ్లు నేషనల్ టీమ్ లకు ప్రతినిధ్యం వహించారు. ఇప్పుడు మరోసారి ఆ రోజులు గుర్తొస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? మరో 5 ఏళ్లలో కెప్టెన్.. ఇక నితీష్ కుమార్ భారత జట్టుకు కెప్టెన్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అతను మరో 5 ఏళ్లు ఆడితే తప్పకుండా టీమ్ ఇండియా సారథి అవుతాడని, దానికోసం మరింత కష్టపడాల్సివుందన్నారు. టీ20, వన్డే, టెస్టుల్లోనూ సత్తా చాటుతాడని చెప్పారు. 21ఏళ్ల కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చాముండేశ్వరీనాథ్ అన్నారు. ఇక మహిళలు కూడా క్రికెట్లో రాణిస్తున్నారని, ఇప్పటికే చాలామంది నేషనల్ టీమ్ కు ఆడుతున్నారన్నారని ఆయన తెలిపారు. ఇక నితీష్ బ్యాటర్ లేదా బౌలరా? తెలియని పరిస్థితిలో ఉన్నానంటూ స్టార్ స్పోర్ట్స్ లో MSK ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చాముండేశ్వరీనాథ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు