AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..!

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది.

New Update
CBNN

Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపారు.

Also Read: US: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

ఈ మూడు చక్రాల వాహనాలకు సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ మూడు చక్రాల వాహనాలను 2024-25 ఏడాదికి.. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు ఇవ్వనున్నారు.

Also Read: PUshpa-2:వరల్డ్ వైడ్‌గా స్పెషల్ షోస్..బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్

ఈ మూడు చక్రాల ఒక్కో వాహనం ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు మొదలు పెట్టనున్నారు. వీలైనంత త్వరగా ఈ వాహనాను అర్హులైన వారికి అందించే పనిలో ఉన్నారు.

Also Read: Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున

రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు చక్రాల వాహనానికి సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీ డిమాండ్‌ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం. దాదాపు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 1,750 మందికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 1,750 మందికి వాహనాలు అందించడంతోపాటు.. ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Also Read: డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్

రాష్ట్రవ్యాప్తంగా మూడు చక్రాల వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం తెలిపింది. అది కూడా డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు.. కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారి ఎంపికలో ముందు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు అర్హులు కాగా.. 18-45 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఈ వాహనాలు అందిస్తారు. అంతేకాదు రూ.3 లక్షలలోపు ఆదాయ పరిమితి ఉండాలి. 

అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచి కొత్త పింఛన్‌లకు సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరించనుంది. ఎవరైనా దివ్యాంగులు అర్హత ఉండి పింఛన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు