Pawan: తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

pawan

Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్ంపదించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ''తిరుపతి ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదన చెందాను.

Also Read: Tirupati Stampede ఆరుగురి మృతి..50 మందికి తీవ్ర గాయాలు!

భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. క్షతగాత్రులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందంచాలని వైద్యారోగ్య శాఖకు సూచించినట్లు పవన్‌ చెప్పుకొచ్చారు.

Also Read: చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

సహాయ సహకారాలు..

మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నాను. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి,వారిని పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్‌ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులకు , పోలీసు సిబ్బందికి జనసేన నాయకులతో పాటు జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఙప్తి చేస్తున్నాను అని పవన్‌ కల్యాన్‌ పేర్కొన్నారు. 

Also Read: AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు నిజమేనా?: బోర్డు సంచలన ప్రకటన!

Also Read: TGPSC: కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌పై TGPSC కీలక ప్రకటన..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు