/rtv/media/media_files/2025/01/31/NC00S4qvfLJUzCJb2r4W.jpg)
ACB attacks on Hostel warden
ACB attacks : ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం లో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఏలూరు లో ఏసీబీ ని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.ఏలూరు ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం బాలకృష్ణ, కే శ్రీనివాస్, రాజమండ్రి సీఐ ఎన్వి భాస్కరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి