Sucide: భువనగిరిలో దారుణం.. హాస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. By srinivas 04 Feb 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏదో చిన్న గొడవ కారణంగా మనస్థాపానికి గురైన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది. అంతేకాదు చనిపోయేముందు వారిద్దరూ కలిసి రాసిన లెటర్ లో చావుకు కారణాలు కూడా వివరించడం విశేషం. కాగా ఈ ఘటన హాస్టల్ విద్యార్థుల తల్లి దండ్రులను కలవరానికి గురిచేస్తోంది. హబ్సిగూడకు చెందిన వారే.. ఈ మేరకు హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన బాలికలు (15) భువనగిరిలోని ఎస్సీ వసతిగృహంలో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. అయితే రోజూలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి వచ్చారు. కానీ సాయంత్రం ట్యూషన్‌కు హాజరుకాలేదు. దీంతో ట్యూషన్ టీచర్ పిలవగా.. తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్నట్లు టీచర్లకు సమాచారం అందించింది. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మేడం తప్ప ఎవరూ నమ్మలేదు.. ఇక ఆ బాలికల దగ్గర లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. ‘మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అంటూ ఆవేదన చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి : Rahul Gandhi: షర్మిలపై సోషల్ ప్రచారాన్ని ఖండించిన రాహుల్ గాంధీ..!! విద్యార్థినుల మధ్య గొడవ.. ఈ దారుణంపై హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్‌ను.. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ సురేష్‌కుమార్, ఎస్సై నాగరాజు, డీఈవో నారాయణరెడ్డి విచారిస్తున్నారు. వసతిగృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో తెలిపారు. ఈ బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇరువురు బాలికల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలిచివేసింది. #bhuvanagiri-sc-hostel #girls-sucide #10th-class మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి