యూరిన్ ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో జాయిన్ అయిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. మంగళవారం మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు. కాంబ్లీకి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించాలని థానే ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ ఎస్.సింగ్ నిర్ణయించుకున్నట్లు త్రివేది చెప్పారు. ఈ క్రమంలో వినోద్ కాంబ్లీ ఆసుపత్రి బెడ్ నుంచే మాట్లాడారు. తన చిన్నాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ , మిగతావారికి కృతజ్ఞతలు తెలిపారు. మేం ఛాంపియన్స్.. అనే మోటివేషనల్ సాంగ్ పాడి క్రికెట్‌పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. సచిన్‌కు థాంక్స్.. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవుతోందని...తనకు తన స్నేహితుడు సచిన్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారని కాంబ్లీ చెప్పారు. తాను ఎప్పటికీ క్రికెట్‌ను వదిలిపెట్టనని చెప్పుకొచ్చారు. ఇక్కడి డాక్టర్ వల్లే బతికి ఉన్నా. ఆయన నన్నేం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంబ్లీ వివరించాడు. మరోవైపు క్రికెటర్‌గా రాణించిన వినోద్ కాంబ్లీపై తమకు గౌరవం ఉందని, అతను కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తామని ఆస్పత్రిలో వైద్యులు తెలిపారు. Also Read: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు