IND vs AUS: సిడ్నీ టెస్టులో టీమిండియా ఆలౌట్ .. బుమ్రా మ్యాజిక్-VIDEO

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం185 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఖవాజా (2) వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది.

New Update
India

India Photograph: (India)

IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం185 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవీంద్ర జడేజా (26), బుమ్రా (22), గిల్ (20), విరాట్ కోహ్లీ (17), వాషింగ్టన్ సుందర్ (14), యశస్వి జైస్వాల్ (10) పరుగులు చేశారు. నితీశ్ డకౌట్‌ కాగా.. కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యాడు. 

 

ఓ దశలో 150 పరుగులు కూడా టీమిండియా చేస్తుందా అన్న అనుమానం నెలకొంది. కానీ కెప్టెన్ బుమ్రా ఓ సిక్స్ , మూడు ఫోర్ల సహాయంతో 185 పరుగులు చేయగలిగింది. ప్రసిధ్‌ (3)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు, సిరాజ్‌ (3*)తో కలిసి పదో వికెట్‌కు 17 పరుగులు జోడించాడు బుమ్రా. ఇక ఆసీస్‌ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, నాథన్‌ లైయన్ ఒక వికెట్ తీశారు. ఆస్ట్రేలియాతో వరుసగా ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఆ జట్టు బౌలర్లను అంచనా వేయడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు.  

Also Read :  140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం


ఊహించని షాక్

ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. మరికాసేపట్లో ఆట ముగుస్తుంది అన్న టైమ్ లో బుమ్రా మ్యాజిక్ చేశాడు. అద్భుతమైన డెలివరీకి ఉస్మాన్ ఖవాజా (2) పెవిలియన్‌కు పంపించాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్‌ ఇచ్చి ఖవాజా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఈ ఓవర్‌ వేస్తుండగానే బుమ్రాతో కొన్‌స్టాస్‌ (7*) వాగ్వాదానికి దిగబోయాడు. అంపైర్‌, ఖవాజా కలగజేసుకోవడంతో గొడవ ముగిసింది. దీంతో ఆసీస్ జట్టు 9 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఆట చివర్లో ఒక వికెట్ పడటంతో టీమిండియా జట్టులో ఆనందం నెలకొంది. రెండో రోజు ఆటతో ఈ జట్టు ఫలితం ఆధారపడనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు