బోనాల వేడుకల్లో బీజేపీ నేత లక్ష్మణ్
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.
అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో జరుగుతున్న బోనాల వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ నింబోలిగడ్డ మహంకాళి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు
పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని ఆలయంలో ఈ రోజు జరిగిన బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లకూడదన్న షరతులతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరిదీ ఉంటుంది అనేదానిపై ఏపీలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు రెండో రోజు. ఈ ఒలింపిక్స్‌ను పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది.
మైయోసైటిస్ అనేది కండరాల వాపుకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ దీర్ఘకాలిక స్థితిలో, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ కండర కణాలను బలహీనపరుస్తుంది, నాశనం చేస్తుంది. ఇది కాలక్రమేణా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది, బాధాకరమైన కండరాల వాపుకుకు కారణమవుతుంది.
మహబూబాబాద్ పోలీసులు మంచి మనస్సు చాటు కున్నారు. నర్సింహులపేట మండలం, పెద్దనాగారంలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నాగన్న కుటుంబానికి అండగా నిలిచారు. వారికి ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఎస్పీ సమక్షంలో ఆ కుటుంబం ఈ రోజు గృహ ప్రవేశం చేసింది.
ఎయిర్‌టెల్ తన రూ. 509 రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లకు మంచి బెనిఫిట్స్ అందిస్తుంది, ఈ ప్లాన్‌తో కస్టమర్‌లకు 84 రోజుల చెల్లుబాటు వస్తుంది. అంటే మీరు ప్యాక్ తీసుకున్న తర్వాత, మీకు దాదాపు 3 నెలల వరకు ప్లాన్ లభిస్తుంది. ఈ రూ.509 ప్లాన్‌తో మొత్తం 6 GB డేటా లభిస్తుంది.
థామ్సన్ ఇటీవల భారతదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు థామ్సన్ NEO కోర్ సిరీస్‌కి చెందినవి. థామ్సన్ ల్యాప్‌టాప్ ధర Intel Celeron ప్రాసెసర్, 4GB RAM, 12GB SSDతో కూడిన బేస్ మోడల్ రూ.14,990 నుండి ప్రారంభమవుతుంది.