చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను తిరిగి లెక్కిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
సీనియర్ హీరో శివాజీ-లయ దాదాపు 15 సంవత్సరాల తర్వాత కలిసి నటించనున్నారు. వీరి కాంబోలో ఓ కామెడి క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. శివాజీ ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తుడటం విశేషం.
చిరంజీవి హీరోగా 'విశ్వంభర' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు మూవీ టీమ్ శ్రీలీలని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పిందట. ఐటం సాంగ్స్ చేయడం తనకి ఇష్టం లేకనే ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
ఒలింపిక్స్ విజేతలైన నీరజ్, నదీమ్ ఇద్దరి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. దీనికి ఎవరు సూట్ అవుతారనే విషయమై స్వయంగా వాళ్లే సమాధానం ఇచ్చారు. అర్షద్ నదీమ్ పాత్రకు అమితాబ్ బచ్చన్, నీరజ్ రోల్ కు షారుక్ ఖాన్ బాగా సూటవుతారని చెప్పారు.
రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. ఈ వీడియోలో ఎవరో బ్లాక్ బికినీ ధరించిన అమ్మాయికి రష్మిక ఫేస్ ను యాడ్ చేశారు. దాన్ని రష్మిక డీప్ ఫేక్ వీడియో పేరుతో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. రష్మిక ఫ్యాన్స్ ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు.
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్ టీమ్ అభినవ్ ను సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన 'కల్కి' మూవీపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.' 'కల్కి’ సినిమా నాకు నచ్చలేదు. ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు' అంటూ పేర్కొన్నారు.