Internet Addiction : ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం, సాంకేతికపరంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఏదైనా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో త్వరగా పొందగలుగుతున్నాము. గతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా నెమ్మదిగా ఉండేది, కానీ ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్నెట్ వలన సమాచారం మరింత వేగంగా మన దగ్గరకి చేరుకుంటోంది. Also Read : 2024లో బరాక్ ఒబామా ఫస్ట్ ఫేవరేట్ గా ఇండియన్ సినిమా! ఏంటో తెలుసా? ఇది నిజంగా అద్భుతమైన విషయమే. కానీ, ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఒక కొత్త విషయం బయటపడింది. అదేంటంటే హైస్పీడ్ ఇంటర్నెట్ వాడకం వల్ల ఊబకాయం భారినపడే అవకాశం ఉన్నట్లు తేలింది. Also Read : నేను చూసేది అదే.. అలా అయితేనే ఒకే చేస్తా! వ్యాయమాలపై దృష్టి అవసరం.. ఇంటర్నెట్ వేగం పెరగడంతో ప్రజలు ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని, శారీరిక శ్రమ లేకుండా, మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ అలవాటు వల్ల శరీరానికి సరైన శ్రమ లేకపోవడం, కేలరీలు ఖర్చు అవ్వకపోవడం వలన ఊబకాయం భారినపడే అవకాశం ఎక్కువ అవుతోంది. Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ అదనంగా, స్క్రీన్ చూస్తూ జంక్ ఫుడ్స్ తినడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. అందుకే ఉద్యోగం, వినోదం కోసం ఇంటర్నెట్ వాడుతున్నా.. మన ఆరోగ్యం కోసం వాకింగ్, రన్నింగ్, లాంటి వ్యాయమాలపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Also Read : లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు