Heavy rains : హైదరాబాద్ లో అనుకోని వర్షం...ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌లో వాతావరణ సమాచారం ప్రకారం ఈరోజు రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక ప్రకారం నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
rains

Rain Alert in hyderabad

Heavy rains : హైదరాబాద్‌లో వాతావరణ సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు దాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.

కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని మరో 14 జిల్లాల్లో (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో) ఉరుములతో కూడిన వర్షాలు లేదా వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ ఏపీ తెలంగాణలో భారీ వర్ష సూచన చేసింది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్.. కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ 

 గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్‌తో పాటు.. కూకట్‌పల్లి, మియాపూర్, మెహదీపట్నం పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై చినుకులు పడే వాతావరణం ఉంది. ప్రస్తుతం భారీ వర్ష సూచన లేదు, కానీ తేలికపాటి జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది, దీనివల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి.

ఏపీలోనూ ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడతోపాటు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
 
హైదరాబాద్ లో  ఈ రోజు కొన్నిచోట్ల చిరుజల్లులే కురిసినా ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇక ఎండాకాలం వానల సమయంలో పిడుగుల ప్రమాదం కూడా ఎక్కువే. సాయంత్రం నుండి రాత్రి వరకు నగరంలో వర్షం కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

Advertisment
తాజా కథనాలు