/rtv/media/media_files/2026/03/20/boys-2026-03-20-21-35-48.jpg)
Five students die in Godavari
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కూనవరం సమీపంలోని కొల్లుగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి డెడ్ బాడీలు ఇప్పటికే లభ్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు స్నేహితులు సెలవులు ఉండటంతో సరదాగా గడిపేందుకు ఇక్కడికి వచ్చారు. అందరూ స్నానాలు చేయడానికి నదిలోకి దిగారు. అయితే ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిలో ఐదుగురు గల్లంతయ్యారు. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
=సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా.. అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా లభ్యమయ్యారు.నీటిలో గల్లంతైన వారి కోసం బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గల SRM యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థుల బృందం సెలవుల నేపథ్యంలో భద్రాచలం పర్యటనకు వచ్చారు. వీరిలో ఇద్దరు భద్రాచలం స్థానికులు కాగా, మిగతా వారు ఇతర ప్రాంతాలకు చెందినవారు. వీరిలో భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్ లతో పాటు ఉయ్యూరుకు చెందిన నవదీప్, మదనపల్లికి చెందిన సతీష్ మృతదేహాలను వెలికితీశారు. తేజజ్ఞ( ఉయ్యూరు) మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది.
Follow Us