/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy
Revanth : పదవతరగతి పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యావిధానంలో కీలక మార్పులు చేయబోతున్నామని, పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యావిధానం ఉంటుందని చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం పలు కీలక అంశాలపై మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం తీసుకువస్తామని సీఎం తెలిపారు.
కాగా వచ్చే ఏడాది నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, కేవలం 12వ తరగతిలో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ భారీ మార్పులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఎడ్యుకేషన్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇది తుది నివేదిక కాదని, సమగ్ర అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రికి ఎడ్యుకేషన్ కమిషన్. నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా విద్యా రంగంలో అనేక వినూత్న సంస్కరణలను సూచించింది. పాత ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని నివేదిక స్పష్టం చేసింది.అలాగే నర్సరీ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని పక్కాగా అమలు చేయాలని ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక సూచించింది.
అలాగే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతుందని రేవంత్ చెప్పారు. విచారణ పూర్తికాకుండా అరెస్టు చేయలేం కదా అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్‍ను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లిన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. పంజాగుట్టలో ఆయనపై వేసిన ప్రైవేట్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6 వేల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. కాగా, 2014 జూన్ 2 న బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీశ్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Follow Us