TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాలబాట పట్టించామన్నారు. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ.. ఈ మేరకు ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన సభలో కొత్త ఆర్టీసీ లోగోను ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ వస్తే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని భావించినా కేసీఆర్ నష్టాలపాలు చేశాడని విమర్శించారు. 'కేసీఆర్ పాలనలో ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఉద్యమం చేశారు. కానీ మా ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపడుతోంది. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఆర్టీసిని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. తెలంగాణలో రవాణను కాపాడాల్సిన బాధ్యతమాపై ఉంది. ఇప్పటికే 4వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని లాభాల బాట పట్టించాం. ఇప్పటికి 115 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. ఇది కూడా చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-59 అలాగే డీజిల్ తో నడిచే బస్సులు, ఆటోలను హైదరాబాద్ నగరం అవతలకు పంపిస్తామన్నారు. డీజిల్ ఆటోలు ఔటర్ రింగురోడ్డు్ అవతల నడిచేలా చూస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ ఆటోలు నడిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.