తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!?

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రతి మండలంలో 5గురు ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం. 

New Update
Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ

TG News: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్.. మండలాల్లో పెరుగుతున్న జనాభాతోపాటు రాజకీయ వివాదాలను కంట్రోల్ చేసేందుకు బిగ్ స్కెచ్ వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 540 గ్రామీణ మండలాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పరచిన మరో మూడు మండలాల్లోనూ ఎంపీటీసీల సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ​అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

22 మండలాలకు ముగ్గురు లేదా నలుగురు..

ప్రస్తుతం 22 మండలాలకు ముగ్గురు లేదా నలుగురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ఒకరు ఎంపీపీ మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం క్లిష్టంగా మారడం, రాజకీయంగా గొడవలకు దారీతీస్తున్నాయి. సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. దీంతో వీటిని అరికట్టేందుకు ప్రతి మండలంలో 5గురు ఎంపీటీసీలు ఉండేలా కసరత్తులు చేస్తోంది. 
3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక ఎంపీటీసీ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఇకపై 3 వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాన్ని సైతం ఎంపీటీసీ నియోజకవర్గంగా చేయాలని భావిస్తోంది. 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామానికి రెండు ఎంపీటీసీ స్థానాలకు పెంచాలని యోచిస్తోంది. 

ఇది కూడా చదవండి: Syria: సిరియా నుంచి ఇడియాకు 75 మంది భారతీయులు

ఇక ముగ్గురు ఎంపీటీసీలు ఉన్న మండలంలో ఎంపీపీ పదవి కోసం ఇద్దరు ఎంపీటీసీలు ఏకమైతే ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీ ఎన్నికయ్యేవారు. మిగిలిన ఒక ఎంపీటీసీకి అంశాల వారీగా మద్దతు లభించేంది. నలుగురు ఎంపీటీసీలు ఉన్న మండలాల్లోనూ సరైన సమన్వయం ఉండట్లేదని భావించిన రేవంత్ సర్కార్ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి:ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్‌పై రూ.15 లక్షల ఫైన్

ఇది కూడా చదవండి: రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు