Telangana: పల్లెపోరులోనూ కాంగ్రెస్సే ముందంజ

తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. దీని ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 

New Update
panchayat

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఒంటి గంటలోపు క్యూ లైన్ లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దాని తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలివిడత 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఇందులో ఏకగ్రీవం అయిన సర్పంచి పదవులు - 396 కాగా ఐదు పదవులకు నామినేషన్లు పడలేదు, ఒకటి కోర్టు స్టే లో ఉంది. అలాగే ఏకగ్రీవం అయిన వార్డు సభ్యులు  - 9633 కాగా 169 కి నామినేషన్లు పడలేదు , పది కోర్టు స్టే లో ఉన్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు.. మొదటగా సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి, కట్టలు కట్టే ప్రక్రియ.. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్లు.. బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ ను ట్రే లో అమర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

ఉప సర్పంచి ఎన్నికా ఈ రోజే..

ఓట్ల లెక్కింపు మొదలై దాదాపు గంట అవుతోంది. దీని ప్రకారం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 279 చోట్ల, బీఆర్ఎస్ 45 చోట్ల, బీజేపీ 5 చోట్ల, ఇతరులు 61 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాల తర్వాత  వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. 

Advertisment
తాజా కథనాలు