BIG BREAKING: రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ సర్కార్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

New Update
Telangana Govt Presents Annual Budget in Assembly

Telangana Govt Presents Annual Budget in Assembly

తెలంగాణ సర్కార్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ టార్గెట్ అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని చెప్పారు. శాసనమండలిలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  

బడ్జెట్ ఖర్చు

బడ్జెట్‌ మొత్తం: రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు

రూ.5 లక్షల జీవిత బీమా 

రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. 
ఈ పథకానికి 4 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. జూన్ 2 నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు.  
ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు.
ITI, ITCల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం అందించనున్నారు.
రూ.73,383 కోట్లతో కొత్త రుణాలకు ప్రతిపాదన చేశారు.

ఏ శాఖకు ఎంత కేటాయింపు 

విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లు

యంగ్‌ ఇండియా స్కూళ్లు: రూ.5 వేల కోట్లు
మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌: రూ.1500 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి: రూ.వెయ్యి కోట్లు
కల్యాణ లక్ష్మీ పథకం: రూ.3,683 కోట్లు
ఉపకార వేతనాలు: రూ.4,343 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌: రూ.3500 కోట్లు
మహాలక్ష్మీ పథకం: రూ.4,305 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు: రూ.5,500 కోట్లు
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: రూ.1143 కోట్లు
గృహజ్యోతి పథకం: రూ.2,080 కోట్లు
చేయూత పథకం: రూ.14,861 కోట్లు
మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం: రూ.723 కోట్లు
రైతు భరోసా: రూ.18 వేల కోట్లు
మెట్రో రైలు ఫేజ్‌-2: రూ.600 కోట్లు
ఆరు గ్యారంటీల అమలు కోసం: రూ.50,713 కోట్లు

Advertisment
తాజా కథనాలు