TG Govt : 'పుష్ప' సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. తగ్గేదే లేదంటూ జనాలను ఉర్రూతలూగించిన బన్నీ ఇగోను తగ్గించేవరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రత్యక్షంగానే వార్నింగ్ ఇస్తోంది. అల్లు అర్జున్ డబ్బు మదంతో విర్రవీగుతున్నాడని, బాధిత కుటుంబంపై కనీసం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నాడంటూ స్వయంగా ఏసీపీ స్థాయి అధికారి మండిపడటం సంచలనం రేపుతోంది. ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఘటన గురించి మాట్లాడటం ఏమిటని? బెయిల్ రద్దు చేసి జైలులో వేస్తామంటూ హెచ్చరించడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు తాను ఏ తప్పు చేయలేదని బన్నీ చెబుతుంటే మరోవైపు తప్పంతా అతనిదే అంటూ సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలో చర్చ పెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. Also Read : సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్! ముఖ్యమంత్రి పేరు గుర్తులేదా? మహిళా అభిమాని రేవతి మరణంపై అల్లు అర్జున్ ఆలస్యంగా స్పందించడంపై పోలీసులతోపాటు నెటిజన్లు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. బన్నీని ఆరాదించే అభిమానులు కూడా అతని వైఖరిపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ల బుద్ది చూపించారని, ప్రెస్ మీట్ పెట్టి కనీసం తెలంగాణ ప్రభుత్వానికి, రేవతి కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పలేదని మండిపడుతున్నారు. మరోవైపు నేషనల్ అవార్డు అందుకుని గొప్ప నటుడిగా జబ్బలు చరుచుకున్న వ్యక్తికి కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి పేరు గుర్తుండకపోవడం దారుణమని, పబ్లిక్ మీటింగ్ లో సీఎం పేరు చెప్పకుండా అవమానించారని తిట్టిపోస్తున్నారు. తాత తరనుంచి తాము తెలుగువారి పేరు నిలబెడుతున్నామని చెబుతున్న అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మరిచిపోతారా? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! సినీ ప్రముఖుల అత్యుత్సాహం.. ఇక ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పకపోవడం అల్లువారి, సినిమా ఇండస్ట్రీ బలుపే అనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు చెప్పినా వినకుండా రోడ్ షో చేయడం, థియేటర్ నుంచి వెళ్లిపోవాలని చెప్పినా వినకుండా అక్కడే కూర్చోవడం కూడా డబ్బు మదమే అంటున్నారు. మరోవైపు జైలునుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి సినిమా ప్రముఖులు పోటెత్తడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి బాధిత కుటుంబాన్ని కలవాల్సిందిపోయి.. నిందితుడిగా ఉన్న నటుడి ఇంటికి వెళ్లడం ఏమిటని జనాలు తిట్టిపోస్తున్నారు. ఇక రేవతి భర్త నాలుగు రోజులు గడిచిన తర్వాత మాట మార్చడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ తప్పేం లేదని, తన భార్య మరణానికి అతడు కారణం కాదంటూ స్టేట్ మెంట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. Also Read : సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్ కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి.. రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన అల్లు అర్జున్.. మరిన్ని డబ్బులు గుమ్మరించి కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే రేవతి భర్త మాట మార్చాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పిన విషయంపై కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. తొక్కిసలాట జరిగితే సినిమా హిట్ అయినట్లే అని అల్లు అర్జున్ చెప్పినట్లు తనకు తెలిసిందని అక్బరుద్దీన్ చెప్పడంతో బన్నీపై మరింత వ్యతిరేఖత పెరిగింది. మొత్తంగా ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ, అల్లుఅర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చేప్పాలని పలువురు సూచిస్తున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ విషయంలోనూ ఇండస్ట్రీ అతి చేసిందనే కోపంతో రేవంత్ సర్కార్ రగిలిపోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. Also Read : రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం!