ఇటీవల అంటే డిసెంబర్ 4న హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లాలో ఉదయం 7:27 గంటల సమయంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించన విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు ఏపీలో సైతం భూప్రకంపనలు సంబవించాయి. Also Read: అధిక కోపం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? దాదాపు 3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించింది. అదే సమయంలో భూప్రకంపనలు సంభవించిన అనంతరం కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కూలిపోయిన భవనాలు, దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన అనేక వీడియోలు చెక్కర్లు కొట్టాయి. ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు తెలంగాణలో మరోసారి భూకంపం అది మరువక ముందే.. ఇవాళ తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు సంబవించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మరోసారి భూమి కంపించింది. పాలమూరు జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో మధ్యాహ్నం 1గంట సమయంలో భూప్రకంపనలు సంబవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.0గా నమోదయ్యింది. అదే సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. దీంతో భయబ్రాంతులకు గురై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇది కూడా చదవండి: పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం! అయితే.. ఈ భూప్రకంపనల వల్ల ప్రమాదమేమీ జరగనట్లు తెలుస్తోంది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగుళ్ల బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ లలో ఉండకూడదని సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు