తెలంగాణ కేబినేట్ 2025 జనవరి 04వ తేదీన సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరగనున్న ఈ కేబినేట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే అందరి చూపు ఉంది. దీనిపై ప్రభుత్వం ఈ కేబినేట్ భేటీలో చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ భేటీలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణి, ఇందిరమ్మ ఇళ్లపై కేబినేట్ చర్చించనుంది. ఇవే కాకుండా కొత్త టూరిజం పాలసీ, ఇంధన పాలసీ, ఎస్సీ వర్గీకరణ, విద్యుత్ కొనుగోళ్ల నివేదికపై కేబినేట్ చర్చించనుంది. దీంతో ఈ కేబినేట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కండిషన్స్ లేకుండా కండిషన్స్ లేకుండా సాగు చేసే ప్రతి ఒక్కరికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని సబ్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. 2025 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తేమనేది మాత్రం రైతులు అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపర్చా్ల్సి ఉంటుంది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు 92 వేల మంది ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలం సీజన్‌లో కోటి 30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. మిగతా 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటంలేదు. సీతక్కకు గుడ్ న్యూస్! పెండింగ్‌లో ఉన్న ములుగు మున్సిపాలిటీపై ఈ కేబినేట్ భేటీలో చర్చించి మరోసారి గవర్నర్ కు ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2022 సెప్టెంబర్ 12న ములుగును మున్సిపాలిటీగా ప్రతిపాదిస్తూ బిల్లును అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఇది రెండు చట్ట సభల్లో ఆమోదం పొందింది. అనంతరం బిల్లును రాష్ట్ర గవర్నర్‌కు పంపించగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంటే వస్తుంది. అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడం, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి గవర్నర్ తమిళిసై పోటీ చేయడం, గవర్నర్ పదవికి రాజీనామా చేయడం, కొత్త గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో బిల్లు పెండింగ్ లో ఉంటూ వస్తుంది. గతేడాది సెప్టెంబర్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్ లో భేటీ అయిన సీతక్క.. ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ కోరారు. దీనిపై ఈ కేబినేట్ భేటీలో చర్చించి అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. Also Read : నిజామాబాద్ టెన్త్ స్టూడెంట్స్ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!