Telangana Budget : తెలంగాణ బడ్జెట్..పెరిగిన కేటాయింపులు..దేనికి ఎంత అంటే...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాది (2025-26) బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.

New Update
tg budget 2026

Telangana Budget

Telangana Budget : తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (మార్చి 20, 2026) అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాది (2025-26) బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.

ప్రధానంగా 2025-26 ,2026-27 బడ్జెట్‌ల మధ్య ఉన్న కీలక తేడాలు, ముఖ్యాంశాలు ఒక్కసారి పరిశీలిస్తే....

1. బడ్జెట్ పరిమాణం (Total Outlay)

2025- 26 బడ్జెట్: రూ. 3.04 లక్షల కోట్లు.
2026- 27 బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ పరిమాణం సుమారు 7% ( అంటే సుమారు రూ. 20,000 కోట్లు) పెరిగింది.
2. కీలక రంగాలకు కేటాయింపులు  
రంగం / శాఖ    2025- 26 కేటాయింపులు (సుమారు)    2026-27 కేటాయింపులు     
విద్యారంగం    రూ. 21,389 కోట్లు                                రూ. 26,674 కోట్లు     

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి . ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025- 26 బడ్జెట్‌ తాజాగా నేడు (మార్చి 20, 2026) ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు,  కేటాయింపుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ పరిమాణాన్ని ప్రభుత్వం సుమారు రూ. 20,000 కోట్లు పెంచింది.

2025-26 బడ్జెట్3,04,965 కోట్లు కాగా 2026-27           బడ్జెట్‌ మొత్తం .రూ. 3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు                              రూ. 2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు                                 రూ. 47,267 కోట్లు

 కీలక రంగాల వారీగా కేటాయింపుల పోలిక

ఈ ఏడాది ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
విద్య: గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన పెంపు కనిపించింది. 2026-27లో విద్యా రంగానికి రూ. 26,674 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూ. 500 కోట్లు, ఒస్మానియా యూనివర్సిటీ మౌలిక సదుపాయాలకు రూ. 1,000 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.

వ్యవసాయం: 2025-26లో రూ. 26,684 కోట్లు కేటాయించగా, ఈసారి (2026-27) రూ. 23,179 కోట్లు కేటాయించారు. అయితే రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలకు ప్రాధాన్యత కొనసాగుతోంది. 
వైద్యం & ఆరోగ్యం: గత బడ్జెట్‌లో రూ. 11,500 కోట్లు ఉండగా, ఈసారి దీనిని రూ. 13,679 కోట్లకు పెంచారు (సుమారు రూ. 2,100 కోట్లు పెరిగింది).

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: ఈ రంగానికి అత్యధికంగా రూ. 33,688 కోట్లు కేటాయించారు.

2026-27 బడ్జెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు

గత బడ్జెట్‌లో లేని కొన్ని వినూత్న కార్యక్రమాలను ఈసారి చేర్చారు:

ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా: రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా. దీని కోసం రూ. 4,000 కోట్లు కేటాయించారు.

బ్రేక్‌ఫాస్ట్ పథకం: ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు పాలు, రాగిజావతో కూడిన అల్పాహారం (కేటాయింపు రూ. 800 కోట్లు).

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని విస్తరించారు.

మెట్రో రైలు స్వాధీనం: ఎల్ అండ్ టీ (L&T) ఆధీనంలో ఉన్న మెట్రోను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకునేలా నిర్ణయం తీసుకుంది (ఫేజ్-2 కోసం రూ. 600 కోట్లు కేటాయించింది.

గోదావరి పుష్కరాలు (2027): వచ్చే ఏడాది జరగబోయే పుష్కరాల ముందస్తు ఏర్పాట్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు.

2025-26 బడ్జెట్ ప్రధానంగా 'ఆరు గ్యారంటీల' అమలుపై దృష్టి పెట్టగా, 2026-27 బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన (Asset Creation),కుటుంబ భద్రతకు పెద్దపీట వేసింది.

మూలధన వ్యయాన్ని (Capital Expenditure) 10% నుండి 20% కి పైగా పెంచడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు