కేటీఆర్కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్...  హైకోర్టులో పిటిషన్ !

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కేటీఆర్‌ ఆదేశాలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

New Update
ktt and acb

ktt and acb Photograph: (ktt and acb)

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు.  కేటీఆర్ లాయర్లను తీసుకువచ్చి ఏసీబీ కార్యాలయం ముందు  హైడ్రామా క్రియేట్ చేశారన్నారు.   ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి న్యాయవాదులను కేటీఆర్ తీసుకొచ్చాడంటూ ఏసీబీ అంటోంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే కేటీఆర్ వాటిని ఉల్లంఘించారని ఏసీబీ  అధికారులు చెబుతున్నారు.  దీనిని తాము న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.  ఈ కేసులో ఏసీబీ ఏం చేయబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది.  కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలుస్తారా లేకా హైకోర్టులో కేటీఆర్‌ ఆదేశాలు ఉల్లంఘించారంటూ పిటిషన్ వేస్తారా అన్నది చూడాలి.  

పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం 

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు  నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి తన లాయర్లతో కలిసి చేరుకున్నారు కేటీఆర్. అయితే  కార్యాలయం లోపలికి  లాయర్లను పోలీసులు అనుమతించలేదు.  ఒంటరిగానే లోపలికి వెళ్లాలన్నారు.  దీంతో పోలీసులతో 40 నిమిషాల పాటు కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.  లాయర్లను ఎందుకు లోపలికి అనుమతించడం లేదని ఇందుకు గల ఆదేశాలు చూపించాలంటూ కేటీఆర్ ఆఫీసు సమీపంలోనే వేచి ఉన్నారు.  పట్నం నరేందర్ రెడ్డికి జరిగింది తనకు జరగవద్దనే లాయర్లతో వచ్చానని కేటీఆర్ తెలిపారు.  లాయర్లతో వస్తే ఏసీబీ అధికారులకు ఏంటీ ప్రాబ్లమ్ అని కేటీఆర్ ప్రశ్నించారు. 

 అనంతరం  పోలీసుల తీరును నిరసిస్తూ ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు.  రాతపూర్వకంగా తన స్టే్ట్ మెంట్ ఏఎస్పీకి ఇచ్చానన్నారు కేటీఆర్. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్‌కు వచ్చానన్న కేటీఆర్ లాయర్లను అనుమతిస్తే విచారణకు కూడా హాజరు అవుతానని స్పష్టం చేశారు.  అనంతరం  అక్కడినుంచి నేరుగా తెలంగాణ భవన్ కు  చేరుకున్నారు కేటీఆర్ . తెలంగాణ భవన్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.  

 రైతు భరోసాను అమలు చేయని సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అందులో భాగంగానే ఈ ఏసీబీ డ్రామాను నడుపుతున్నారని మండిపడ్దారు. తనను ఏసీబీ ఆఫీసుకు పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. 

Also Read :  నా ఇంటి మీద రైడ్స్కు రేవంత్ కుట్ర .. కేటీఆర్ కీలక కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు