Alert : రైతు భరోసా విధానాలేంటి.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనా!

రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తారు. అయితే రైతులు మళ్లీ ఎలాంటి ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.  వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. షరుతులు లేకుండా పండించిన ప్రతి పంటకు సాయాన్ని అందిస్తారు.

New Update
rythu Bharosa revanth reddy

rythu Bharosa revanth reddy Photograph: (rythu Bharosa revanth reddy)

రైతు భరోసా స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.   ఏడాదికి రూ. 12 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు రైతు బంధు స్కీమ్ ను తీసుకువచ్చింది.  ఈ స్కీమ్ కింద ప్రతి రైతుకు రూ. 10 వేలు అందించింది. అయితే తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ. 15వేల అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో వెల్లడించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా నిధులను రూ. 12 వేలుగా ఇస్తామని ప్రకటించింది.  

ఏడాదికి రూ. 12 వేలు

రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తారు.  ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ చేస్తారు.  మరో ఆరు నెలలకు రూ. 6వేలు రైతు ఖాతాలో జమవుతాయి.  

భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందిస్తామని సీఎ రేవంత్  రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని నామకరణం చేశారు.  

ఈ స్కీమ్ ను 2025 జనవరి 26వ తేదీన ప్రారంభించినున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.  

అయితే ఈ రైతు భరోసా స్కీమ్ కు మళ్లీ ఎలాంటి ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.  వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

షరుతులు లేకుండా పండించిన ప్రతి పంటకు  రైతు భరోసా సాయాన్ని అందిస్తారు.  వ్యవసాయానికి యోగ్యం కాని భూములు అంటే రాళ్లు, రప్పలు, కొండలకు ఈ స్కీమ్ వర్తించదు.  

వ్యవసాయ యోగ్యంకాని  భూములను గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా  సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి వివరాలు అందిస్తారు.  

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు గానూ ప్రభుత్వానికి  భారీగా ఖర్చవుతుంది. దాదాపుగా రూ. 20వేల కోట్లను జనవరి 26 లోపు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.  

Also Read :  మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు