RTC terminals : ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లు..జిల్లా సర్వీసులకు నగరంలోకి నో ఎంట్రీ

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ జిల్లా సర్వీసులు ఇకమీదట నగరంలోకి వచ్చే అవకాశం లేదు. జిల్లాలనుంచి వచ్చే డీజిల్‌ బస్సులను నగరంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టడి చేయనుంది. వాటిని ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
FotoJet (25)

RTC terminals around Outer Ring Road

RTC terminals : రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ జిల్లా సర్వీసులు ఇక మీదట నగరం లోకి వచ్చే అవకాశం లేదు. జిల్లాల నుంచి వచ్చే డీజిల్‌ బస్సులను నగరంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టడి చేసేందుకు సిద్ధమవుతోంది. వాటిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్ర రాజధాని నగరంలో కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులే ఆర్టీసీ సిటీ సర్వీసులుగా నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాలుష్యాన్ని నివారించే ఉద్ధేశంతో  తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్‌ ఆర్టీసీ బస్సులన్నింటిని ఓఆర్‌ఆర్‌( ఔటర్‌ రింగురోడ్డు) వరకే పరమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లాలు, ఇతర ప్రాంతాల ప్రధాన రూట్లను ఔటర్‌ రింగురోడ్డుతో అనుసంధాన్చి ఆ  ప్రాంతాల్లో ఆర్టీసీ టెర్మినల్స్‌ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రాజధాని నగరంలో చిన్నా పెద్ద వాహనాల సంఖ్య కోటికి చేరువుతున్నది. ఈ నేపథ్యంలో నగరంలో వాతావారణ కాలుష్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీన్ని నియంత్రించేందుకు పెట్రోలు/డీజిల్‌ వాహనాలను తగ్గించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌ లోపల డీజిల్‌ సిటీ సర్వీసుల స్థానంలో  కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్‌ కింద 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులు కావాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. రాష్ర్ట ప్రభుత్వ వినతి మేరకు మొదటి విడతలో కేంద్రం రెండువేల ఎలక్ట్రిక్‌ బస్సులను మంజూరు చేసింది. 

ఇదిలా ఉండగానే ప్రస్తుతం నగరంలో ఉన్న 200 డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా రెట్రోఫిట్‌మెంట్‌ చేసేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. వాటితో పాటు ఎలక్ట్రిక్‌ బస్సులు దశలవారీగా వచ్చి చేరుతాయి. తగినన్ని ఎలక్ట్రిక్‌ బస్సులు రాగానే నగరంలో నడిచే డీజిల్‌ బస్సులను విడతలవారీగా జిల్లాలకు తరలిస్తారు.  తద్వారా సిటీ రోడ్లపై ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు తప్ప డీజిల్‌ బస్సులు కనిపించకుండా చర్యలు చేపట్టాలని ప్రభు త్వ కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత జిల్లాల నుంచి వచ్చే డీజిల్‌ బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేసి ఆ ప్రాంతాల్లో  బసు టెర్మినళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో భారీ టెర్మినల్‌ నిర్మించనున్నారు. నగరానికి ఇప్పటికే మంజూరైన హైస్పీడ్‌ రైళ్ల కోసం శంషాబాద్‌లో ఈ భారీ టెర్మినల్‌ నిర్మించి దాన్ని మెట్రో రైలుతో అనుసంధానం చేస్తారు. అదే సమయంలో అక్కడే ఆర్టీసీ టెర్మినల్‌ కూడా నిర్మిస్తారు.  తద్వారా బెంగళూరు నుంచి వచ్చే ఆర్టీసీ జిల్లా సర్వీసులు అక్కడికే పరిమితం చేస్తారు. ఇక అక్కడి నుంచి నగరానికి చేరుకోవాలంటే  ప్రయాణికులు తప్పకుండా ఎలక్ట్రిక్‌ బస్సులను ఎక్కాల్సిందే.  దీనిలాగే హైదరాబాద్‌ చుట్టూ ఓఆర్‌ఆర్‌ ప్రధాన రోడ్డుకు అనుసంధానమయ్యేలా ఇతర టెర్మినళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 అయితే ప్రస్తుత నిర్ణయం మేరకు నగరంలో కేవలం ఆర్టీసీ మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతుంది. అదే సమయంలో  ప్రైవేటు డీజిల్‌ బస్సులు మాత్రం ఎప్పటిలాగే తిరగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం తీసుకునే కాలుష్య నివారణ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే  దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు ప్రైవేటు బస్సుల్లో నేరుగా తమ గమ్యాలకు చేరుకుంటారు. కనుక అందరూ వాటినే ఆశ్రయించే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలా అని కాకుడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను కూడా నగర శివారులకే పరిమితం చేస్తే ప్రభుత్వ సంకల్పం కొంతమేర నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే ఆయా బస్సు సర్వీసుల యజమాన్యాలు దీనికి అంగీకరిస్తాయా అన్నది ప్రశ్నార్థకం. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తోందో వేచి చూడాల్సిందే.   

#Electric buses #district services #outer-ring-road #RTC terminals #rtc-bus
Advertisment
తాజా కథనాలు