Jeevan Reddy : నాకు అన్యాయం జరగడానికి కారణం రేవంత్ రెడ్డినే...జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కారణమని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమమానాలు బరిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేనని, ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

New Update
MLC Jeevan Reddy Shocking Comments On CM Revanth Reddy🔴LIVE : నన్ను మోసం చేశారు..! | Congress | RTV

Jeevan Reddy's sensational allegations

Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కారణమని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమమానాలు బరిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేనని, ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్టానానికి, జగిత్యాల నియోజకవర్గం కార్యకర్తలకు లేఖ రాశారు. గడచిన 20 నెలలుగా పార్టీలో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమై, అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నారు. ‘నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి’ అని కార్యకర్తలను కోరడం గమనార్హం.

కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్‌ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో తనకున్న 40 ఏండ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక 25న కార్యకర్తల సమావేశంలో చర్చించేందుకు కలుద్దామని జీవన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించాలని ఆయన కోరారు. అయితే ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే విషయమై క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. 29న ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు.  

గడచిన నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖలో కృతజ్క్షతలు తెలిపారు. 25 రోజున భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డులో ఉన్న బండారి గార్డెన్‎లో ఉదయం 10:00 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు జీవన్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మీ సలహాలు, సూచనలతో, భవిష్యత్, రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, అందదండలతో, వాకు మానసిక స్థైర్యం కలిగిస్తు, మార్గదర్శకం కాగలరని మనవి’’  అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, జీవన్‌ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్నప్పటికీ అధిష్టానం ఆయనను బుజ్జగిస్తూ వస్తున్నది. గతంలో ఆయనను డిల్లీకి సైతం తీసుకెళ్లి అగ్రనాయకులతో హామీ ఇప్పించినప్పటికీ బీఆర్‌ఎస్‌ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ విషయంలో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. కాగా జీవన్‌ రెడ్డిని బుజ్జగించడానికి శనివారం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమాలు జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా  జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.  పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. అయినా కూడా జీవన్‌రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

Advertisment
తాజా కథనాలు