Pilot Rohit Reddy :  మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డికి షాక్.. అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌?

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం మరో మలుపు తిరిగింది. మొయినాబాద్ అజీజ్ నగర్‌లో ఉన్న ప్రస్తుత ఫామ్‌ హౌజ్‌ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ ఫామ్‌ హౌజ్‌ను ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి కట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

New Update
FotoJet (13)

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy :  బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇటీవల ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే. మొయినాబాద్ అజీజ్ నగర్‌లో ఉన్న ప్రస్తుత ఫామ్‌ హౌజ్‌ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ ఫామ్‌ హౌజ్‌ను ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి కట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ తరచూ వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా దాని నిర్మాణం చుట్టూ కూడా పలు వివాదాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి చట్టపరమైన చిక్కులున్నట్లు తెలుస్తోంది.అజీజ్‌నగర్‌లోని సర్వే నంబర్ 177/33లో సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్‌హౌస్ నిర్మితమైంది. అయితే ఫామ్‌ హైజ్‌ నిర్మించిన భూమి 2006లో రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ 'భూభారతి' రికార్డుల్లో మాత్రం ఈ భూమి జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించడం ఇపుడు సర్వత్రా చర్చనీయంశమైంది.

ఈ ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఆ ఫామ్‌ హౌజ్‌ను అసైన్డ్‌ భూమిలో కట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం అసైన్డ్‌ భూమిని అమ్మడం, రిజిస్ట్రేషన్‌ చూయడం నేరం. అలాంటిది అసైన్డ్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది.? , దానికి సహకరించిన అధికారులు ఎవరు..? అనేది ఇపుడు పోలీసులు ఎంక్వరీ మొలు పెట్టారు. రంగంలోకి దిగిన  రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న అధికారుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఫామ్‌హౌజ్‌ను సీజ్‌ చేసిన అధికారులు నిర్మాణ వివరాలు రాగానే మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

అసలేం జరిగిందంటే..?

కాగా, మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ పరిధిలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఫామ్‌ హౌజ్‌ ఉంది. అయితే ఇటీవల అందులో 11 మంది విందు చేసుకుంటున్నారనే సమచారం మేరకు పోలీసులు రైడ్‌ చేశారు.  దీంతో పోలీసులపై కొంతమంది ఫైర్‌ చేశారు. అనంతరం దాడులు చేసిన పోలీసులు అక్కడ డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఫామ్‌హౌస్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాక పట్టుబడ్డ వారి వాహనాలను కూడా సీజ్‌ చేశారు.  కాగా రోహిత్‌ రెడ్డి గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనూ ప్రముఖంగా ఉన్నారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో బీఆర్‌ఎస్‌ ఆయనకు సోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు