Yennam Srinivas Reddy: అల్లు అర్జున్‌పై మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీస్తూ జనాల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. బూతు సినిమాలు తీసి తాము గొప్ప వాళ్ళం అనే విర్రవీగుతున్నారంటూ సినీ నటులను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని, ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్ దత్తత తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారు.. ఈ మేరకు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి.. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారన్నారు. పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే నాకేం వస్తుందని ఒక నటుడు తనతో అన్నాడని ఫైర్ అయ్యారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారు. కానీ అభిమానులు ముప్పై వేల జీతం వచ్చినా మూడు వేల రూపాయలతో టికెట్ కొని సినీతారల స్టార్ డం కాపాడుతున్నారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్, వస్తారని నమ్మకం లేదు. ఈ నటుల కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచు లక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ చాలామంది కృత్రిమ సమాజంలో బతుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మహాత్మ గాంధీ 'పాకిస్థాన్' జాతిపిత.. దుమారం లేపుతున్న సింగర్ అభిజిత్ వ్యాఖ్యలు అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు.. ఇక అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలకు హాజరయ్యే నటులు ప్రజలకి ఇబ్బందులు వస్తే కనీసం ఒక్కరూ కూడా స్పందించరు. పాపులారిటీలో సినీ నటుల కంటే రాజకీయ నాయకులు తక్కువగా కనిపిస్తారు. కానీ ప్రజా సంబంధాల విషయంలో మేం చాల బెటర్. ప్రజలను మనుషులుగా చూడాలి. తమిళ నటులకు ఉన్న సామాజిక సృహ తెలుగు నటులకు ఎందుకు లేదు. వైద్యానికి, చదువుకి దాచుకున్న డబ్బులతో వాళ్ళ సినిమాలకి వెళ్తే అభిమానుల గుండెల్లో గుణపాలు దించుతున్నారంటూ మండిపడ్డారు.