/rtv/media/media_files/2026/03/18/indiramma-illu-2026-03-18-16-43-14.jpg)
indiramma illu
Indiramma Illu: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చేసి చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. శాసన మండలిలో మంగళవారం నాడు హౌసింగ్ పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మార్చి నాటికి లక్ష ఇండ్లు పూర్తికానున్నాయి
— Office of Ponguleti (@PonguletiOffice) March 18, 2026
మొదటి విడతలో మంజూరు చేసిన ఇండ్లు జూన్, జూలై నాటికి పూర్తవుతాయి
గతంలో 2BHK ఇండ్లను దూర ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది
పట్టణ ప్రాంత పేదలకు జీవనోపాధి దృష్ట్యా సమీప ప్రాంతాల్లోనే డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విషయం… pic.twitter.com/m9o0aNTTu9
“ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు జరగగా, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదన్న మంత్రి, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి చివరి నాటికి సుమారు లక్షఇళ్లు పూర్తి కానున్నాయి. జూన్ -జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైనంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన 2BHK ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించుకోలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా, 2BHK పథకంలో పెండింగ్ బిల్లులలో 99% ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఆగిపోయిన 2BHK ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు.
Follow Us