Rachakonda CP: మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు.. సీపీ కీలక ప్రకటన!

మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా.. హైకోర్టు ఈ నెల 24 వరకు టైం ఇచ్చిందన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు.

New Update
Mohan Babu Rachakonda CP

మంచు ఫ్యామిలీలో విభేదాలపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతోందన్నారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. ఆయన ఈనెల 24 వరకు టైం అడిగినట్లు చెప్పారు. హైకోర్టు సైతం ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తామన్నారు. అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

రాచకొండ కమిషనర్ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న రెండు గన్స్ ను ఎక్కడైనా డిపాజిట్ చేయొచ్చని నోటీసులు ఇచ్చామన్నారు. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయన్నారు. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

గన్ ను పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు..

మోహన్ బాబు ఈ రోజు తిరుపతిలోని తన విద్యాసంస్థల వద్దకు వెళ్లిపోయారు. ఆయన వద్ద ఉన్న డబుల్ బ్యారల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు విద్యానికేతన్ పీఆర్వో సతీష్ అప్పగించారు. అయితే.. చంద్రగిరి పోలీసులు తమకు సమర్పించిన మోహన్ బాబు గన్ ను స్టేషన్ నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆ గన్ ను ఎస్పీకి అప్పగించారు.

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు