విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేటి బాలలను రేపటి పౌరులుగా.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పడం పోయి వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కొందరు ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులకు మంచి చెడులు చెప్పాల్సింది పోయి వారిపట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. Also Read: సంధ్య థియేటర్ ఘటన.. వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు : విజయశాంతి ఇప్పటికి ఎంతో మంది ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలయ్యారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లి దండ్రులకు తెలవడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! మహాబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాలోని డీఎన్టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలలో 7గురు బాలికలు, 11 మంది బాలురు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 2 ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ధరంసోతు శ్రీను అనే ఉపాధ్యాయుడు 6నెలల కిందటే ఈ స్కూల్‌కు బదిలీ పై వచ్చాడు. Also Read: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపిస్తున్నాడు ఈ ఉపాధ్యాయుడు స్కూల్ టైంలో సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపుతున్నాడని.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని నాలుగో తరగతికి చెందిన 3 విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. అంతేకాకుండా పిలవగానే తన దగ్గరకు రావాలని లేకుంటే కోప్పడుతున్నాడని వారు తెలిపారు. Also Read: పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ దీంతో పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. కొందరు అతడిపై చేయిచేసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై ఉపాధ్యాయుడు ధరంసోతు శ్రీనుపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు