ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
గతేడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో భద్రాద్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వ అధికారిగా ఉంటూనే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి రాజకీయ అరగేంట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం తథ్యమని స్పష్టంచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది.
వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్లం 50 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరదలతో మరో 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్తి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే కొద్ది రోజుల క్రితం వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41.2 అడుగులకు చేరింది.అటు పాలేరు రిజర్వాయర్‌తో పాటు మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం (Bhadrachalam)వద్ద గోదావరి (Godavari) నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది.