ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు సంభవించడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని హైదరాబాద్ కు మళ్లించి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో దాదాపుగా 144 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో విమానంలోని ప్రయాణికులు అంతా ఊపిరి పిల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. Also Read : రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన వరసుగా విమాన ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా వరసుగా విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజగా ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విమానం పడిన ప్రాంతంలో భవనం పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. ఆ తర్వాత విమానంలో మంటలు చెలరేగాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే దక్షిణ కొరియాలోని మువాన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఇందులో 181 మందిగా ఉండగా.. దాదాపుగా అందరూ చనిపోయారు. Also Read : బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు