Breaking News : బిగ్ షాక్ .. హైదరాబాద్లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు

హైదరాబాద్ లో  11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2024 డిసెంబర్ నెలలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుడుతూ..  మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీకి వచ్చారు. ఇక్కడ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో  11 మందికి పాజిటివ్ గా తేలింది

New Update
hyd hmpv

hyd hmpv Photograph: (hyd hmpv)

చైనాను వణికుస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలలో  కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటికంటే ముందే హైదరాబాద్ లో  11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  అవును... ఈ విషయాన్ని ఓ ప్రైవేటు ల్యాబ్ వెల్లడించింది. 258 మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు చేయగా... అందులో 11 మంది శాంపిల్స్ లలో   హెచ్‌ఎంపీవీ వైరస్  పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది. 

డిసెంబర్ నెలలో

 2024 డిసెంబర్ నెలలో పలువురు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుడుతూ..   హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీకి వచ్చారు. ఇక్కడ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో  11 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక   94 శాంపిల్స్‌ బ్యాక్టీరియల్ న్యూమోనియా, 62 రినో వైరస్‌, 33 అడెనో వైరస్‌ కేసులు ఉన్నట్లుగా వెల్లడించింది.  ఇక 9 కేసుల్లో ఇన్‌ఫ్లూయెంజా, ఒక వ్యక్తికి హెచ్‌1ఎన్‌1 వైరస్ సోకినట్లుగా ప్రైవేటు ల్యాబ్ స్పష్టం చేసింది.  అయితే హెచ్‌ఎంపీవీ వైరస్ సోకిన వారంతా డిశ్చార్జ్ అయినట్లుగా చెప్పింది. 

ఆయితే హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తదేం కాదని దీని గురించి ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం  లేదంటూ ఇప్పటికే   భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ ఇండియాలో ఉన్నట్లుగా వెల్లడించింది.  

HMPV లక్షణాలు ఇవే 

ఈ హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు.   ఈ వైరస్‌ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి.  దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. 

Also Read :  బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు