Telangana CM Revanth Reddy : రైతులకు గుడ్‌ న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల..కానీ బ్యాంకులకు సెలవు కావడంతో..

గత కొంతకాలంగా రైతు భరోసా నిధులపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తొలివిడతలో 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

New Update
rythu bima

Rythu Bharosa

Telangana CM Revanth Reddy : గత కొంతకాలంగా రైతు భరోసా నిధులపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తొలివిడతలో 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో ఎకరం  భూమి ఉన్న రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశారు. అయితే ఈరోజు ఆదివారం కావడంతో రైతుల ఖాతాల్లోకి రేపు (సోమవారం) నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.

]మరో 20 రోజుల  తర్వాత మిగతా రూ.5,400 కోట్లు రైతు భరోసా నిధులు జమకానున్నాయి. మరో 2 విడతల్లో రూ.2,700 కోట్లు చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు(ఆదివారం) సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం అక్కడ నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి  గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని వివరించారు.

రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరతో సహా రూ.500 బోనస్‌ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతినెలా రైతుల సంక్షేమం కోసం రూ.5,500 కోట్ల వ్యయం అవుతుందని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. 20 నెలల్లో రైతుల కోసమే రూ.లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం వివరించారు.

Advertisment
తాజా కథనాలు