సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని సర్వే నంబర్ 30 సంబంధిత భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని సాకుగా చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. షెడ్లు నిర్మించి రోడ్లు కూడా వేస్తున్నారని కాంత్రి కిరణ్ అన్నారు. సర్వే నెంబర్ 30 పై వివాదం కోర్ట్ లో పెండింగ్ ఉన్నప్పటికీ అదే సర్వే నెంబర్ లో బై నెంబర్లు ఎలా సృష్టించారని ఆయన ప్రశ్నించారు. నిషేద జాబితాలో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్ అవుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి : బీజేపీ, బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు రద్దు చేసిన యాజమాన్య పత్రాలను చూపించి మంత్రి దామోదర రాజనర్సింహా అనుచరులతో ఈ కబ్జాలకు స్కెచ్ వేశారని బీఆర్ఎస్ నేత అన్నారు. అక్కడ ఎవరెవరు తిరిగారో, ఏయే కార్లు ఆ ప్రాంతానికి వచ్చాయో వివరాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. 720 ఎకరాల భూమిపై జరుగుతున్న అక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. 500 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంటుందని తేలినప్పటికీ, అక్రమ పట్టాలతో ప్రైవేట్ వ్యక్తుల పేరిట మంత్రి దామోదర రాజనర్సింహ అంతని అనుచరులు భూ రిజిస్ట్రేషన్లు చేస్తు్న్నారని చెప్పుకొచ్చారు. దీనికి దామోదర రాజనర్సింహ అనుచరులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. 2001 నుంచి హైకోర్టులో నడుస్తున్న కేసులపై కోర్టు స్టే ఉన్నప్పటికీ, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం చూస్తుంటే పెద్దల అండతోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దమోదర రాజనర్సింహాపై ప్రధాన ఆరోపణలు చేశారు ఆంథోల్ మాజీ ఎమ్మెల్యే.