Panjagutta Tragedy : పంజాగుట్టలో ఘోర ప్రమాదం: బాల్కనీ స్లాబ్ కూలి తండ్రీకొడుకుల మృతి

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర విషాదం నెలకొంది. బాల్కనీ స్లాబ్‌ కూలడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుందన్‌బాగ్‌లోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ఈ పెను విషాదం చోటు చేసుకుంది

New Update
five members of same family found dead under suspicious circumstances in hyderabad

Fatal accident in Panjagutta: Father and son die after balcony slab collapses

Panjagutta Tragedy : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర విషాదం నెలకొంది. బాల్కనీ స్లాబ్‌ కూలడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నగరంలోని పాత అపార్ట్‌ మెంట్‌ల భద్రతపై ఆందోళనకు దారి తీసింది. హైదరాబాద్, కుందన్‌బాగ్‌లోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ఈ పెను విషాదం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (56), అతడి కొడుకు వరుసైన వివేక్ (32)లు ఎలక్ట్రిషియన్‌లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తు్న్నారు.  

కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌ యజమాని ద్వారకాప్రసాద్ మూడవ అంతస్తులో బాల్కనీ పొడిగింపు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ పనులు నిమిత్తం లక్ట్రిషియన్‌లుగా పనిచేస్తున్న దేవీదాస్‌, వివేక్‌లను ఇంటికి పిలిపించాడు.  ఈ క్రమంలో ముగ్గురు మూడో అంతస్తుకు చేరుకుని చేయాల్సిన పనుల గురించి బాల్కనీలో నిలబడి చర్చించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్‌ కూలిపోయింది.. దీంతో ముగ్గురు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో  దేవీదాస్, వివేక్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక విచారణ ప్రకారం ఆ అపార్ట్‌ మెంట్‌ నిర్మించి చాలాకాలం అయిందని, అందులో నిర్మాణ లోపాలు ఉండటం లేదా పాతబడిన ఇనుప రాడ్లు తుప్పు పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. బాల్కనీ పొడిగింపు (Extension) కోసం చేపట్టిన పనుల్లో భాగంగా పాత నిర్మాణానికి, కొత్తగా వేసే ఐరన్ రాడ్లకు మధ్య పట్టు (Bonding) సరిగా లేకపోవడం కూడా ఈ ఘటనకు ప్రధాన కారణం కావచ్చని పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు