మున్సిపల్ పీఠాలకు ముహూర్తం ఖరారు: ఏప్రిల్ 4న మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు!

మూడు కీలక మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గడువు ఖరారు చేసింది. క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.

New Update
BREAKING

BREAKING

తెలంగాణలోని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మూడు కీలక మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గడువు ఖరారు చేసింది. క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మూడు మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ గత కొంతకాలంగా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా చైర్మన్ ఎన్నికల నిర్వహణపై BRS పార్టీ సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోందని భావిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై రేపు (మంగళవారం) హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ షెడ్యూల్ వెలువడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

బాల్క సుమన్ హెచ్చరిక 

ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని బాల్క సుమన్ మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం వెనువెంటనే స్పందిస్తూ పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు కొత్త తేదీలను ప్రకటించడం విశేషం. 

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 4న జరగబోయే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు