Pushpa: 'పుష్ప' సినిమా వివాదంలో మొదట తెలంగాణ ప్రభుత్వానే పొరపాటు అని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చిత్రం బెనిఫిట్ షోలను నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వడంతోపాటు టికెట్ ధరలు భారీగా పెంచేకునేలా ప్రోత్సహించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. "పుష్ప2" సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరారు. స్మగ్లింగ్‌తో పాటు అసభ్యకరమైన పాటలు.. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. "పుష్ప' చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తోందా? అని ప్రశ్నించారు. స్మగ్లింగ్‌తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం సిగ్గులేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. 'అదేమైన సమాజానికి ఉపయోగపడే సినిమానా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి. దీనిలో పోలీసుల తప్పేం లేదు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు, కళాకారులు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. త్వరలో మా వంతు సాయం ప్రకటిస్తాం" అని అన్నారు. ఇది కూడా చదవండి: Helicaptor Crash: ఆస్పత్రిని ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్, నలుగురు మృతి జగపతి బాబు సానుభూతి.. ఇదిలా ఉంటే సీనియర్ నటుడు జగపతి బాబు ఈ ఘటనపై స్పందించారు. 'సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా.అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు..' అని పేర్కొన్నారు. పుష్ప 2" ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంబంధిత కేసులో అల్లు అర్జున్ ఇటీవల అరెస్టు అయి బెయిల్‌పై విడుదలయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సినీ ప్రముఖుల్లో జగపతి బాబు మొదటి వ్యక్తి కావడం గమనార్హం.