TG NEWS: హైదరాబాద్‌లో చిరుత..ఏపీలో పులి..సంక్రాంతి వేళ హైటెన్షన్!

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం రేపింది. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి..చెట్లల్లోకి వెళ్లింది. చిరుత పాద ముద్రలు సైతం చూసిన మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

New Update
chirutha rajendranagar

chirutha rajendranagar Photograph

TG NEWS: తెలుగు రాష్ట్రాల్లో చితల కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలో చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో వాకింగ్‌కు వచ్చిన వారి కంట చిరుత పడింది. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం దగ్గరకు చిరుత వచ్చింది. చిరుత జనాలను గమనించి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయినట్లుగా వాకింగ్‌ చేసే వాకర్స్ తెలిపారు. అదేవిధంగా చిరుత పాద‌ ముద్రలను అక్కడ గుర్తించారు. 

భయంతో పరుగులు:

విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చిరుత సంచారం చేస్తోందనే విషయం అందరికీ తెలియడంతో... స్థానికులు, విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. క్యాంప‌స్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇంతకు ముందు కూడా చిరుత సంచ‌రించినట్లు చెబుతున్నారు. చిరుత సంచార సమాచారం అందుకున్న  అటవీశాఖ అధికారులు వెంటనే బోన్లు ఏర్పాటు చేశారు. ఎంతో చాకచక్యంగా చిరుత‌ను బంధించారు. అయితే.. ఈ చిరుత పులి శంషాబాద్, గ‌గ‌న్‌ప‌హాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్  ప్రాంతంలో ఉండి.. శంషాబాద్, శంషాబాద్, హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, మొయినాబాద్‌లోని గ్రామాల చుట్టూ సంచ‌రిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. క్యాంప‌స్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిరుత పులి సంచ‌రరంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: ఇది తాగారంటే విటమిన్ B12 లోపం అస్సలు ఉండదు

మరో చిరుత:

ఇది ఇలా ఉంటే..ఏపీలో మరో పెద్దపులి కలకలకం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని ఘాట్‌రోడ్డులో పెద్దపులి  సంచారం చేసింది. దారాలమ్మ ఘాట్‌ మార్గంలో పులి సంచారం చేస్తున్న కదలికలను స్థానికులు గుర్తించారు. అయితే బస్సులో డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ప్రయాణికులకు ఈ పులి రోడ్డుపై కనిపించింది. పులి కదలికలను బస్సులో నుంచి ఎదురుగా వచ్చిన పులి వీడియో తీశారు. ఇది సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పులి సంచారంలో ప్రజలంతా భయ పడుతున్నారు.  ప్రభుత్వం, అటవీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మరి కొందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి:  చలికాలంలో పంటి నొప్పి ఎందుకు పెరుగుతుంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు