IRCTC user IDs : 3 కోట్ల IRCTC ఖాతాలపై కేంద్రం వేటు

కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతను చేపట్టనున్నట్లు తెలిపింది. ఇటీవల తత్కాల్‌ టికెట్ల జారీ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతకు శ్రీకారం చుట్టడం గమనార్హం.

New Update
FotoJet - 2025-12-12T070532.989

Center suspends 3 crore IRCTC accounts

IRCTC user IDs : కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతను చేపట్టనున్నట్లు తెలిపింది. ఇటీవల తత్కాల్‌ టికెట్ల జారీ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్‌ చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. AKAMAI వంటి యాంటీ బాట్‌ టెక్నాలజీని వినియోగించి నకిలీ, ఆటోమేటెడ్‌ ఖాతాలను తెరవడానికి జరిగిన  ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కాగా, వీరి స్థానంలో సామాన్యులకు సాధారణ, తత్కాల్‌ టికెట్లు అందేలా రిజర్వేషన్‌ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. తత్కాల్‌ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్‌ బేస్డ్‌ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం 322 రైళ్లకు దీన్ని వర్తింపజేశామని ఆయన తెలిపారు. దీని ద్వారా ఆయా రైళ్లలో తత్కాల్‌ టికెట్ల అందుబాటు సమయం దాదాపు 65 శాతం వరకు పెరిగిందని చెప్పారు. అలాగే రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద తత్కాల్‌ బుకింగ్స్‌కు ఓటీపీ వెరిఫికేషన్‌ విధానాన్ని డిసెంబర్‌ 4 వరకు 211 రైళ్లకు వర్తింపజేసినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల 96 పాపులర్‌ ట్రైన్ల టికెట్ల అందుబాటు సమయం 95 శాతం మేర పెరిగిందని అశ్విని వైష్ణవ్ వివరించారు

Advertisment
తాజా కథనాలు