/rtv/media/media_files/2026/03/17/rohit-2026-03-17-09-30-53.jpg)
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరికలు పంపారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించబోమని ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2026
పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ
మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్
వారం రోజుల్లోగా… pic.twitter.com/w2RccbusRj
పోలీసులు దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీ కలకలం రేపింది. ఎటువంటి అనుమతి లేకుండా జరుగుతున్న ఈ పార్టీపై శనివారం రాత్రి 9:30 గంటలకు పోలీసులు దాడి చేశారు. ఘటనా స్థలంలోడ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న ఐదుగురికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ గన్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిది కాగా, లైసెన్స్ ఉన్నప్పటికీ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఈ పార్టీలో మొత్తం 10 మంది (9 మంది పురుషులు, ఒక మహిళ) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Follow Us