MLA KTR: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు దాడికి దిగారు మాజీ మంత్రి కేటీఆర్. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సస్యశామలంగా మారిందని అన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతులు రెండు పంటలు పండుతున్నాయని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ అసలైన పండుగ అంటే ఇదే! కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. " వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ!, సాగును సంబురం చేయడమంటే ఇదీ!, దాచేస్తే దాగని సత్యాలు ఇవి!, తొమ్మిదున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుతాలివి!. 2013-14 నుంచి 2022-23మధ్య కాలంలో వ్యవసాయం,సాగునీటి రంగాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజా గణాంకాలే నిదర్శనం!. Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! * తెలంగాణలో సాగునీటి సదుపాయం(రెండు పంటలు); 2013-14 – 78 లక్షల 18 వేల ఎకరాలు2022-23 - కోటీ 60 లక్షల ఎకరాలు * తెలంగాణలో పంటల సాగు (రెండు పంటలు) ; 2013-14 - కోటీ 55 లక్షల ఎకరాలు2022-23 - 2 కోట్ల 29 లక్షల ఎకరాలు * ఆహార పంటల ఉత్పత్తి; 2013-14 - 2 కోట్ల 25లక్షల టన్నులు2023-24 - 5 కోట్ల టన్నులు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా....మిషన్ కాకతీయ ..కాళేశ్వరం..రైతుబంధు సహాఅనేక వ్యవసాయ అనుకూల విధానాల ఫలితాలు ఇవి! .చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవి!" అని ట్వీట్ చేశారు. Also Read: Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ నందిని సిధారెడ్డికి అభినందనలు.. తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, మరియు ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని అన్నారు. సంస్కృతి ని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం అని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు మీరు చూపిన నిబద్ధతకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!