/rtv/media/media_files/2025/03/12/rw6tQWcBsNWpLwDUH4Lp.jpg)
Padi Kaushik Reddy
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కౌశిక్ రెడ్డికి సొంతపార్టీలోనే నిరసన సెగ తగిలింది. కౌశిక్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆయన అనుచరులు పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. ఆయన వ్యవహార శైలితో విసిగిపోయిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు సుమారు 250 మంది జమ్మికుంట సమీపంలోని ఒక ప్రాంతంలో రహస్యంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలువురు నాయకులు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల పార్టీకి చెడు పేరు వస్తుందని వారు భావిస్తున్నారు. ఆయన తీరుతో విసిగిపోయిన పలువురు అనుచరులు, బీఆర్‌ఎస్ క్యాడర్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కీలక బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి జమ్మికుంట శివారులో రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్బంగా వారు కౌశిక్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. -- సుమారు 250 మందికి పైగా నాయకులు బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హుజూరాబాద్ నియోజవర్గంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తల పట్ల కౌశిక్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా వారంతా సమావేశమై ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోనే ఉంటూ కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడమా?, లేక పార్టీ మారడమా? అనే అంశంపై అసంతృప్త నాయకులు చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో కిందిస్థాయి నాయకుల మాటలు అధిష్టానం వింటుందా? అని వారు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమలో ఎలా ముందుకు సాగాలనేది కూడా నేతలు సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది.
నియోజక వర్గంలోనే కాకుండా రాష్ర్టంలోనే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్‌పై కౌశిక్ రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఇదిలాఉంటే, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు, వీణవంక సమ్మక్క జాతర సమయంలో జరిగిన గొడవలు హుజురాబాద్‌లో పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాల్ని అధిష్టానానికి తెలిసినప్పటికీ ఆయనను మందలించకపోవడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారని అసంతృప్త నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉండటం కన్న బయటకు వెళ్లడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్‌తో పలువురు నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా త్వరలోనే పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది, అయితే కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ అధిష్టానంలోనూ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. వరస వివాదాలతో పార్టీకి నష్టం కలిగిస్తున్న కౌశిక్ రెడ్డిపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Follow Us