Driving License: తెలంగాణలో 10 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

TG: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను 6 నెలల పాటు రద్దు చేశారు

New Update
Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను  6 నెలల పాటు రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన లైసెన్స్ లలో 7దాదాపు 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులదే అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం చట్ట విరుద్ధం. మొదటి దొరికితే ఫైన్ వేసి కోర్టు ముందు హాజరుపర్చుతారు పోలీసులు. అయితే మూడోసారి కూడా మద్యం సేవించి  పోలీసులకు చిక్కితే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారి లైసెన్స్ లను రద్దు చేస్తున్నారు అధికారులు.

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

రద్దైన లైసెన్స్ లలో...

  • 70 శాతం మందు బాబులవి,
    * మిగతా 30 శాతం ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్ తో రోడ్లపై భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని.. అందులో ఎక్కువ మంది మైనర్లు, యువత ఉండడం ఆందోళన కలిగించే అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు?

ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాది ఏప్రిల్​1 నుంచి మార్చి 31 వరకు  ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్​లను అధికారులు రద్దు చేస్తూ ఉంటారు. కానీ, జాప్యం చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈసారి అధికారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఏడాది వరకు ఆగకుండా మార్చి నుంచి 8  నెలల కాలానికి  సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read  :  మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు