/rtv/media/media_files/2026/03/23/vivo-v70-fe-2026-03-23-19-01-50.jpg)
Vivo V70 FE
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన వివో త్వరలో భారతదేశంలో Vivo V70 FEని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండోనేషియాలో లాంచ్ చేశారు. ఇది Vivo V70, Vivo V70 Elite లతో కలిసి వివో వి70 సిరీస్‌లో ఒక మోడల్.
Also Read : బుర్రపాడు మావా: ఏసీ, ఫ్రిడ్జ్‌లపై భారీ ఆఫర్లు.. ఇవాళే లాస్ట్ డేట్..!
Vivo V70 FE smartphone Launching Soon
తాజాగా కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో భారతదేశంలో విడుదల కానుందని వెల్లడించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో Vivo V70 FE కోసం ఒక ప్రకటన చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. Vivo V70 FE పింక్, గ్రీన్ కలర్‌లలో లభిస్తుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అంచనా ప్రకారం.. ఏప్రిల్ 2న విడుదల అవుతుందని సమాచారం. ఈ Vivo V70 FE స్మార్ట్‌ఫోన్ ధర రూ. 35,000 కంటే తక్కువగా ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇండోనేషియాలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM / 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,600, 12 GB / 256 GB వేరియంట్ ధర రూ. 39,400, 8 GB / 512 GB వేరియంట్ ధర రూ. 40,300గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌తో కూడిన 6.83-అంగుళాల Q10+ AMOLED (1,260 × 2,800 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
Vivo V70 FE వెనుక కెమెరా యూనిట్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
Also Read : పిచ్చెక్కించే ఆఫర్.. Galaxy S26పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!
Follow Us