New Smartphone: రచ్చ రంబోలా: 200MP కెమెరాతో Vivo కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే..!

వివో ఇటీవల ఇండోనేషియాలో వివో V70, వివో V70 FE లను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు Vivo V70 FEను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K Q10+ AMOLED డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 

New Update
Vivo V70 FE smartphone

Vivo V70 FE smartphone

అతిపెద్ద హ్యాండ్‌సెట్ కంపెనీలలో ఒకటైన వివో ఇటీవల ఇండోనేషియాలో వివో V70, వివో V70 FE లను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు Vivo V70 FEను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K Q10+ AMOLED డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 

Vivo V70 FE smartphone

దీని ధర రూ.35,000 లోపు ఉండొచ్చని ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ Vivo V70 FE ఏప్రిల్‌లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు. Vivo V70 FE స్పెసిఫికేషన్లు ఇండోనేషియాలో లాంచ్ అయిన మోడల్‌ను పోలి ఉండొచ్చని భావిస్తున్నారు.  

ఇండోనేషియాలో ఈ Vivo V70 FE స్మార్ట్‌ఫోన్.. 8 GB RAM /256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,600, 12 GB / 256 GB వేరియంట్ ధర రూ. 39,400, 8 GB / 512 GB వేరియంట్ ధర రూ. 40,300గా ఉంది. Vivo V70 FE సిల్వర్, బ్లూ, లైట్ పర్పుల్ కలర్‌లలో లభిస్తుంది.

ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయి గల 6.83-అంగుళాల Q10+ AMOLED (1,260 × 2,800 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా యూనిట్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు