/rtv/media/media_files/2026/03/16/summer-ac-tips-2026-03-16-20-55-18.jpg)
Summer AC Tips
వేసవి కాలంలో చాలా మంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలను ఉపయోగిస్తుంటారు. అయితే ఏసీని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ఓ వైపు కరెంట్ బిల్లు మోత మోగిపోవడమే కాకుండా మరోవైపు ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ వేసవిలో మీ ఏసీని ఎలా వాడుకోవాలో నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి. అవి తెలుసుకుందాం.
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఏసీని ఎప్పటి నుంచో వాడుతున్నవారు.. వేసవికి ప్రారంభంలోనే నిపుణుల చేత సర్వీసింగ్ చేయించుకోవాలి. డస్ట్ ఫిల్టర్లు బాగున్నాయా లేదా.. కాయిల్స్ శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి. ఇవి బాగుంటే ఏసీ వేగంగా కూల్ అవుతుంది.
అలాగే ఏసీ ఉపయోగిస్తున్న వారు వేసవిలో సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం చాలా ముఖ్యం. ఏసీని ఎల్లప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం బెటర్. దీని వల్ల కరెంట్ ఆదా అవడం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి డిగ్రీ పెంచినకొద్ది 6శాతం కరెంట్ ఆదా అవుతుంది.
వేసవిలో వారానికి ఒకసారి లేదా పది రోజులకో సారి ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే.. ఏసీ లోపల దుమ్ముదూళి పేరుకుపోయి గాలి ఫ్లో తగ్గిపోతుంది. దీని వల్ల కంప్రెషర్ మీద భారం పడుతుంది.
ఈ సీజన్ లో ముఖ్యంగా ఏసీ ఆన్ చేసే ముందు రూమ్ డోర్స్, కిటికీలు మూసివేయాలి. చిన్న ఖాళీ ఉన్నా చల్లదనం బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువసేపు రన్ అవుతుంది.
ఈ సీజన్ లో ఏసీ చల్లదనం గదిమొత్తం వ్యాపించాలంటే.. తక్కువ స్పీడ్ లో సీలింగ్ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ ను వేయాలి.
సలహాలు
చాలా మంది రాత్రి పూట పడుకునే ముందు ఏసీని ఆన్ చేసి ఉంచడంవల్ల ఉదయం వరకు రన్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా పడుకునే ముందు స్లీప్ మోడ్ లేదా టైమర్ పెట్టుకుంటే.. గది కూల్ అయిన తర్వాత దానంతట అదే ఆగిపోతుంది.
ఏసీ అవుట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎండ వేడికి దాని సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.
చేయకూడని పనులు
చాలా మంది ఏసీని ఆన్ చేసిన వెంటనే రూమ్ చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీలకు పెడతారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కంప్రెషర్ మీద ప్రభావం పడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే ఏసీ ఇండోర్ యూనిట్ కింద లేదా పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచకూడదు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు వంటి వేడిని రిలీజ్ చేసే వస్తువులను దూరంగా పెట్టాలి.
ఏసీని గంటల తరబడి వాడకూడదు. గది కూల్ అయిన తర్వాత కొద్ది సేపు ఆఫ్ చేయాలి.
ఏసీ ఆన్ లో ఉన్న సమయంలో స్మోకింగ్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ వాసన ఫిల్టర్లకు చేరి రూమ్ మొత్త బ్యాడ్ స్మెల్ వచ్చేలా చేస్తుంది.
Follow Us